యువ కథానాయకుడు రామ్ పోతినేని(Ram Pothineni) హీరోగా తమిళ సీనియర్ దర్శకుడు లింగుస్వామి(Lingu Swamy) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ది వారియర్’. (The Warrior) ఈ మూవీలో రామ్ పవర్ ఫుల్ పోలీసు ఆఫీసర్ పాత్రలో అలరించబోతున్నాడు. అయితే ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గురించి ఒక క్రేజీ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ మూవీ ఇంటర్వెల్ లో రివీల్ అయ్యే ట్విస్ట్ సినిమా మొత్తానికే హైలైట్ గా ఉంటుందట. ప్రస్తుతం ఈ టాపిక్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.
కాగా, ఆది పినిశెట్టి విలన్గా నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ నిర్మించిన ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ సినిమాలో రామ్ సరసన కృతీ శెట్టి, అక్షర గౌడ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ‘ది వారియర్’ మూవీ చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ‘ది వారియర్’ సినిమా జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది.
Recent Comment