నందమూరి నటసింహం బాలకృష్ణ (Bala Krishna), మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) కాంబోలో ఓ సినిమా తెరకెక్కనుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆహాలో బాలయ్య హోస్ట్ గా చేసిన అన్ స్టాపబుల్ టాక్ షోకు రవితేజ అతిథిగా వెళ్లారు. ఆ సమయంలో వారిద్దరి మధ్య జరిగిన సంభాషణలో ఇద్దరం కలసి ఓ సినిమా చేద్దామని నిర్ణయించుకున్నారు. బాలయ్య హీరోగా రవితేజ డైరెక్టర్ గా చేయాలి అనుకున్నారు.
ఇక మరోవైపు.. యువ దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi) ప్రస్తుతం ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3 మూవీ చేస్తున్నారు. వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్లో రూపొందుతోన్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. మే 27న ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే.. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి బాలయ్యతో సినిమా చేయనున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. జూన్ లేదా జులైలో షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు.
అయితే.. ఇందులో మరో హీరో క్యారెక్టర్ ఉందట. ఆ క్యారెక్టర్ ను కళ్యాణ్ రామ్ తో చేయించాలి అనుకుంటున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ.. తాజా సమాచారం ప్రకారం ఆ పాత్రను రవితేజతో చేయించాలని ఫిక్స్ అయ్యారట. అనిల్ రావిపూడి రవితేజతో రాజా ది గ్రేట్ అనే సినిమా చేశారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. అందుచేత అనిల్ రావిపూడి చెప్పిన వెంటనే.. రవితేజ బాలయ్య సినిమాలో నటించేందుకు ఓకే చెప్పారని తెలిసింది
Recent Comment