తెలుగు చిత్రసీమలో సూపర్ స్టార్ మహేశ్ బాబు(mahesh babu) ప్రస్తుతం ‘సర్కారువారి పాట’ (sarkaru vaari paata) మూవీతో బిజీగా ఉన్నారు సూపర్ స్టార్ మహేశ్‌బాబు. ఆ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఓ సినిమాలో నటించనున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత బాహుబలితో వరల్డ్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ రాజమౌళి ( Rajamouli) దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన బడ్జెట్ గురించి ఫిల్మ్‌నగర్‌లో ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది.
తాజా సమాచారం ప్రకారం బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాల కంటే ఎక్కువ బడ్జెట్‌తో, ఈ సినిమాను సీనియర్ ప్రొడ్యూసర్, బిజినెస్ మ్యాన్ డా.కె ఎల్ నారాయణ శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై నిర్మించనున్నారు. దాదాపు 800 కోట్ల రూపాయలతో ఈ సినిమాను రూపొందించాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమాను పాన్ వరల్డ్ స్థాయిలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదే గనుక నిజమైతే తెలుగులో నిర్మించబోయో అత్యంత భారీ బడ్జెట్ మూవీ ఇదే అవుతుంది. ఇదిలాఉంటే, మహేశ్ బాబుతో చేయాల్సిన ఈ సినిమాను రాజమౌళి పూర్తిగా ఆఫ్రికన్ జంగిల్ నేపథ్యంలో రూపొందించన్నట్లు సమాచారం.
Recent Comment