భారత, దక్షిణ ఆఫ్రికా జట్ల మధ్య జోహాన్స్ బర్గ్ లో జరుగుతున్న రెండవ టెస్టులో దక్షిణ ఆఫ్రికా 27 పరుగుల ఆధిక్యం సాధించింది.

తన మొదటి ఇన్నింగ్స్ లో దక్షిణ ఆఫ్రికా 229 పరుగులకు అల్ అవుట్ అయ్యింది.  అంతకు ముందు, టాస్ గెలిచి బాటింగ్ ఎంచుకున్న భారత్ తన మొదటి ఇన్నింగ్స్ లో 202 పరుగులకు అల్ అవుట్ అయ్యిందన్న సంగతి మనందరికీ తెలిసిం దే.

దక్షిణ ఆఫ్రికా ఇన్నింగ్స్ లో ఓపెనర్ పీటర్సన్ 62 పరుగులు, బావుమా 51 పరుగులతో రాణించారు.  భారత బౌలర్ల లో శార్ధూల్ ఠాకూర్ ఏడు వికెట్లతో కెరీర్ బెస్ట్ బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు.  షమి రెండు వికెట్లు, బుమ్రా ఒక వికెట్ తీశారు