సూపర్ స్టార్ మహేష్ బాబు, పరశురామ్ దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ సర్కారు వారి పాట. ఈ మూవీని మే 12న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో ప్రమోషన్ లో భాగంగా ఈరోజు మొదటి పాటను రిలీజ్ చేశారు .కళావతి అంటూ సాగే ఈ పాట ఇప్పుడు యూట్యూబ్ లో అదరగొడుతోంది.kalavathi song ని అద్భుతమైన సాహిత్యంతో అనంత శ్రీరామ్ రాయగా సిద్ శ్రీరామ్ అద్భుతమైన గానంతో పాడారు. ఇక ఈ పాటకి తమన్ అందించిన మ్యూజిక్ మరో హైలెట్ అని చెప్పాలి.kalavathi lyrics video విడుదల చేయగా ఇందులో mahesh babu, keerthy suresh చాల స్టైలిష్ గా కనిపించారు. కీర్తి సురేష్ ని మహేష్ బాబు ఫాలో అవుతూ, తనని ఇంప్రెస్ చేసే విధంగా సాంగ్ తెరకెక్కించారు.విదేశాల్లో అందమైన లొకేషన్స్ లో ఈ పాటను కలర్ ఫుల్ గా చిత్రీకరించారు. ఈ పాట mahesh babu అభిమానులతో పాటు మ్యూజిక్ లవర్స్ అని కూడా అలరించడం ఖాయం .మొత్తానికి కళావతి పాటతో sarkaaru vaari paata సినిమాపై అంచనాలు మరింత చేశారు మహేష్ బాబు. సరిలేరు నీకెవ్వరు మూవీ తర్వాత మహేష్ బాబు నుండి వస్తున్న సినిమా కావడంతో ఇండస్ట్రీ లో అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. మరి sarkaaru vaari paata ఆ అంచనాలను అందుకొని బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందేమో చూడాలి.
Recent Comment