ఐపీల్ 2022 ఆక్షన్ లో ఆర్సీబి కొత్త వ్యూహంతో ముందుకు వెళుతోంది. మిగతా ప్రాంఛైజీలు తక్కువ ధరలకు ఎక్కువ ప్లేయర్స్ ని కొనుగోలు చేయగా rcb మాత్రం ముగ్గురు ప్లేయర్స్ కోసమే కోట్లు ఖర్చు పెట్టింది.rcb ఇప్పటికె విరాట్ కోహ్లీ ( Virat Kohli ) ,మాక్స్ వెల్ ( Maxwell ) ,మహ్మద్ సిరాజ్ ( Mahammad Siraj ) వంటి ప్లేయర్స్ ని తమ దగ్గరే పెట్టుకుంది.ఈ సీజన్ లో ఒక్కో టీమ్ లో మినిమం 18 మంది Maximum 25 మంది ప్లేయర్స్ ఉండొచ్చు. దాంతో 57 కోట్లతో rcb మెగా వేలంలోకి వెళ్ళింది. కానీ ముగ్గురు ఆటగాళ్ల కోసమే సగం అమౌంట్ ఖర్చు చేసింది. గత ఏడాది ipl లో అద్భుత ప్రదర్శన చేసిన బౌలర్ హర్షల్ పటేల్ ( Harshal Patel ) ని పోటీ పడి మరి 10.75 కోట్లకు కొనుగోలు చేసింది. అలాగే ఆల్ రౌండర్ కోటాలో వనిందు హాసరంగకు కూడా 10.75 కోట్లు పెట్టి కొనుక్కుంది. ఇక csk విజయాలతో కీలక పాత్ర వహించిన బ్యాటర్ డూప్లెసిస్ ని కొనుగోలు చేయడానికి తీవ్రంగా పోటీ పడింది. చివరికి du plessis ని rcb 7 కోట్ల భారీ ధర పెట్టి తీసుకుంది. మొత్తం 57 కోట్లలో ముగ్గురు ప్లేయర్స్ కోసమే 28.5 కోట్లు కుమ్మరించింది. ఇక మిగిలిన అమౌంట్ తో మిగతా ప్లేయర్స్ ని ఈరోజు కొనుగోలు చేయనుంది. rcb కోట్లు పెట్టి కొనుక్కున్న ఈ ప్లేయర్స్ rcb కి ipl టైటిల్ అందించడానికి ఎంతవరకు కృషి చేస్తారో చూడాలి.
Recent Comment