సినిమాలు లేక సినీ పరిశ్రమ ఆఫీస్ బేరర్ల పదవులకు పాకులాడుతున్న మంచు ఫ్యామిలీ.
సినిమా ఇండస్ట్రీ మీద పెత్తనానికి పాకులాడుతున్న మంచు ఫ్యామిలీ
మంచు ఫ్యామిలీ కుటుంబానికి సినిమాలు లేవు. వాళ్ళు చేసిన చూడడానికి ప్రేక్షకులు సిద్దం గా లేరు. కాని ఇండస్ట్రీ లో ఉనికి చాటుకోవడానికి మంచు ఫ్యామిలీ పాకులాడుతున్నట్లు కనిపిస్తోంది. మోహన్ బాబు 500 పైగా సినిమాలు చేశారు, విలన్ గా, హీరో గా చేసినా స్టార్ స్టేటస్ అందుకోలేకపోయారు.
మోహన్ బాబు కొడుకులు మంచు మనోజ్, మంచు విష్ణు. అయితే మంచు మనోజ్ సినీ కెరీర్ గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. మంచు విష్ణు కెరీర్ లో చెప్పుకోదగిన సినిమా అంటూ ఏమైనా ఉంటె అది శ్రీను వైట్ల దర్శకత్వం లో వచ్చిన “ఢీ” మాత్రమే. “ఢీ” సినిమా విజయవంతం కావటంలో విష్ణు పాత్ర కన్నా సహనటులు బ్రహ్మానందం, శ్రీహరి, సునీల్, చంద్రమోహన్, జీనీలియా వంటి వారి పాత్ర ఎక్కువ. చాల సినిమాలు చేసినా పాపం హీరో గా మాత్రం సక్సెస్ కాలేకపోయాడు. మంచు లక్ష్మి నటిగా కన్నా అడపా దడపా యాంకరింగ్ చేస్తూ కాలక్షేపం చేస్తోంది.
తెలుగు సినిమా స్వర్ణోత్సవాలలో చిరంజీవి ని లెజెండ్ గా ప్రకటించినప్పటి నుంచి, మోహన్ బాబు మెగాస్టార్ చిరంజీవి కి వచ్చిన పేరును చూసి తట్టుకోలేకపోతున్నాడు. ఆ రోజు మొదలైన ఈ అసూయ నిన్న మొన్నటి “మా” ఎలెక్షన్స్ వరకు వచ్చింది. ఇప్పుడు చిరంజీవి ఇద్దరి వ్యక్తుల తగాదాలను పరిష్కరించే పెద్దరికం నాకొద్దు అని ప్రకటించగానే మంచు ఫ్యామిలీ పేరు తెరమీదకు వచ్చింది.
రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు సమాధానం ఇస్తానని దాటేసిన పెద్ద మనిషి మోహన్ బాబు. ఇన్ని రోజుల నుంచి సినీ ఇండస్ట్రీ ఇన్ని సమస్యలతో ఉంటే ఇప్పటిదాకా మంచు ఫ్యామిలీ ఏం చేసింది.
సినిమా టికెట్ల వ్యవహారం మీద ఈయనగారు…సదరు మోహన్ బాబు ఇప్పటిదాకా ఏం చేశారో.
పెద్దరికానికి, పెత్తనానికి మంచి మనసు ఉండాలి. పదవులు కాదు మోహన్ బాబు కి పిచ్చి ఉందని అక్కినేని నాగేశ్వర రావు గారు ఒకానొక సందర్భంలో చెప్పారు
నటనలో ను, వ్యక్తిత్వం లోనూ చిరంజీవి…ఒక లెజెండ్. మోహన్ బాబు ఒక సాధారణ నటుడు మాత్రమే……………………!!!!!!
Recent Comment