ఫిల్మ్ ఇండస్ట్రీ లో హీరోగా నిలదొక్కుకోవాలంటే బ్య్యాక్ గ్రౌండ్ ఉండాలి అనే మాటను పక్కనపెట్టి,  స్వయం కృషితో అంచలంచెలుగా ఎదుగుతూ సక్సస్ ఫుల్ హీరోగా తనకంటూ ఓ స్పెషల్ ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్న యంగ్ హీరో బెల్లం కొండ సాయి శ్రీనివాస్. జనవరి 3న  ఈ యంగ్ హీరో జన్మ దినం .ఈ సందర్భంగా infotainment guru హృదయ పూర్వక జన్మ దిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

టాలీవుడ్లో పలు హిట్ చిత్రాలు నిర్మించి  అగ్ర నిర్మాతగా ఓ వెలుగు వెలిగిన  బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. తొలి చిత్రం అల్లుడు శ్రీను తోనే బిగ్గెస్ట్ కమర్షియల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో వర్క్ చేయడం నిజంగా లక్ అనే చెప్పాలి.  పైగా ఈ  చిత్రంలో శ్రీనివాస్ కు జోడిగా అందాల తార సమంత హీరోయిన్ గా నటించడం విశేషం.  మిల్కీ బ్యూటీ తమన్నా  ఓ ప్రత్యేక గీతంలో నర్తించడం తో అల్లుడు శ్రీను చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆ అంచనాలను ఈ మాత్రం వమ్ము చేయకుండా తన  ఈజ్ నటన తో , డ్యాన్స్ లతో అందరినీ అబ్బురపరిచాడు. ఇలా అల్లుడు శ్రీను తో మొదలయిన హీరోయిజం మొన్నటి అల్లుడు అదుర్స్ వరకు సక్సస్ ఫుల్ గా నే సాగింది. ప్రస్తుతం బెల్లం కొండ సాయి. శ్రీనివాస్ ఛత్రపతి  హిందీ రీమెక్ తో బాలీవుడ్లో పాగా వెద్దామనుకుంటున్న ఈ చిత్రానికి దర్శకుడు వి వి వినాయక్ కావడం విశేషం. ఈ యంగ్  అండ్ డైనమిక్ హీరో కు బాలీవుడ్  లో డిజిటల్ మీడియా పరంగా భీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఈయన నటించిన  తెలుగు చిత్రాలు హిందీలో డబ్ అయి యూట్యూబ్ లో మిలియన్స్ వ్యూస్ తో దూసుకుపోతున్నాడు. మరి.. బాలీవుడ్ లో కూడా  ఈ హీరో సక్సస్ అవ్వాలని కోరుకుంటూ మరో సారి హ్యాపీ బర్త్ డే చెబుదాం.