పట్టాలెక్కిన త్రివిక్రమ్-మహేశ్ మూవీ.. ఇదిగో ప్రూఫ్..
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు కొన్నాళ్లుగా మోకాలి నొప్పితో బాధపడుతున్న విషయం తెలిసిందే.. డాక్టర్ల సూచన మేరకు ఇటీవల స్పెయిన్‌కి వెళ్లి సర్జరీ చేయించుకున్నారు. ప్రస్తుతం ఆయన దుబాయిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే తాజాగా మహేష్ బాబు ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. “టీంతో కలిసి మధ్యాహ్నాం పని చేశాను.. వర్క్ అండ్ చిల్” అంటూ దానికి క్యాప్షన్ జతచేశారు. అందులో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సంగీత దర్శకుడు తమన్, నిర్మాత నాగవంశీ, కనిపించారు. అంటే వీరంతా కలిసి తదుపరి సినిమాకు సంబంధించిన పనులపై చర్చించినట్లు తెలుస్తోంది.
కాగా, పాన్ ఇండియా మూవీస్ ఆర్‌ఆర్‌ఆర్, రాధేశ్యామ్ విడుదలను దృష్టిలో పెట్టికొని మహేశ్ బాబు.. తాను కథానాయకుడిగా నటిస్తున్న ‘‘సర్కారువారి పాట’ను 2022 సంక్రాంతి నుంచి ఏప్రిల్ 1కి వాయిదా వేస్తున్నట్టు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. కాగా ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంయుక్తంగా ఈ చిత్రాన్నినిర్మిస్తున్నాయి.
Recent Comment