సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనే టాపిక్ ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. సినిమాల్లో అవకాశాలు రావాలంటే కమిట్మెంట్ ఇవ్వాలని,అలా ఇచ్చినవారికి ఎక్కువ అవకాశాలు వస్తాయని చాలామంది నటీమణులు బహిరంగ కూడా తెలిపారు.ఇప్పుడు ఇదే విషయాన్ని సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ అనుష్క కూడా తెలిపారు .క్యాస్టింగ్ కౌచ్ మీద అనుష్క సంచలన కామెంట్ చేశారు .సినిమాల్లో అవకాశాలు రావాలంటే హీరోయిన్స్ దర్శకనిర్మాతలతో పడుకోవాలని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇది అన్ని ఇండస్ట్రీ లో ఉండేదే అని, కానీ తనతో మాత్రం ఇప్పటివరకు ఎవరూ అలా ప్రవర్తించలేదని ఆమె తెలిపారు .మొదటి నుంచి ప్రతి విషయంలో నేను కరెక్ట్ గా ఉంటానని ,ఏది ఉన్నా మొహం మీద చెప్పేసేలా ఉండడంతో నాతో అలా ప్రవర్తించడానికి ఎవరూ సాహసించలేదని ఆమె చెప్పుకొచ్చారు .కానీ క్యాస్టింగ్ కౌచ్ మీద చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ తో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు కూడా క్యాస్టింగ్ కౌచ్ మీద ఆవేదన వ్యక్తం చేశారు. మరి ఇప్పుడు అనుష్క చేసిన ఈ కామెంట్స్ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.