మహేష్ బాబు (Mahesh babu),కీర్తి సురేష్(Keerthy Suresh ) జంటగా నటిస్తున్న చిత్రం సర్కారు వారి పాట(Sarkaaru vaari paata).పరుశురాం దర్శకత్వంలో బ్యాంక్ మోసాలా నేపథ్యంలో ఈ మూవీ వస్తోంది. ఇటీవల రిలీజ్ చేసిన కళావతి సాంగ్ సూపర్ హిట్ రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. మే12 న ఈ మూవీ విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. అందుకే షూటింగ్ ని త్వరగా కంప్లీట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక తాజాగా అన్నపూర్ణ స్టూడియోలో సర్కారు వారి పాటలో భారీ యాక్షన్ ని చిత్రీకరించారు. ఈ ఫైటింగ్ కోసం భారీ సెట్ వేసినట్టు సమాచారం.ఈ ఫైట్ లో మహేష్(Mahesh ) విలన్స్ తో పోరాటాలు చేస్తున్నారు. ఇక త్వరలోనే ఈ మూవీ టాకీ పార్ట్ కంప్లీట్ కానుంది. ఈ మూవీకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.GMB ఎంటర్ టైన్మెంట్,14 రీల్స్ వారు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.సరిలేరు నికెవ్వరు చిత్రం తరువాత మహేష్ చేస్తున్న మూవీ కావడంతో ఇండస్ట్రీలో అంచనాలు పెరిగిపోయాయి.