చాలా ఏళ్ల తరువాత మోహన్ బాబు(Mohan babu ) హీరోగా ఎన్నో అంచనాలతో వచ్చిన సినిమా సన్నాఫ్ ఇండియా(Son of India ).రిలీజ్ నకి ముందు మంచు ఫ్యామిలీ ఈ మూవీ కోసం ఎంతగానో ప్రచారం చేశారు. కానీ ఈరోజు విడుదల అయిన ఈచిత్రం మోహన్ బాబుని(Mohan babu) ఎంతొ నీరాశకు గురిచేసింది.ఈ సినిమా చూసేందుకు థియేటర్స్ లో ప్రేక్షకులు ఎక్కడా పెద్దగా కనపించలేదు.ఇక ఈ మూవీ విడుదల ,మూవీకి వస్తున్న రెస్పాన్స్ గురించి నెట్ లో చాలామంది ట్రోల్ చేస్తూ నిరాశ పరచిన సన్నాఫ్ ఇండియా (Son of india )అంటూ ట్రోల్ చేస్తున్నారు. అయితే మోహన్ బాబు ట్రోల్ విషయంలో బాధగా ఉన్నప్పటికీ ఆత్మభిమానం ఉంది కనుక ఇలాంటివి పట్టిచుకోను అంటూ స్పందించారు .అయితే మంచు ఫ్యామిలీపై కొంత కాలంగా ఇలాంటి విమశ్శలు,ట్రోల్స్ జోరుగా వస్తున్నాయని, కావాలని కొందరు దెబ్బతీస్తున్నారని అయినా కూడా నేను పట్టించుకోను అని మోహన్ బాబు (Mohan babu )ఆవేదన వ్యక్తం చేసాడు.