గత రెండేళ్లుగా చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సినీ పరిశ్రమ 2021వ ఏడాది క్రా,క్ అఖండ, వకీల్ సాబ్ ,పుష్ప చిత్రాలతో ఊరట నిచ్చింది అని చెప్పాలి. ఇప్పుడిప్పుడే ఫిల్మ్ మేకర్స్ అందరూ ఈ విజయాలను ఇండస్ట్రీ విజయాలు గా భావించి 2022 కొత్త ఏడాదిలోకి చాలా జోష్ తో ఎంట్రీ ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో జనవరి 7 న రిలీజ్ అవ్వాల్సిన  ప్యాన్ ఇండియా మూవీ అర్ అర్ అర్ ఏప్రిల్ వరకు వాయిదా వేశారు. డార్లింగ్ ప్రభాస్ రాధే శ్యామ్ చిత్రం కూడా రిలీజ్ వాయిదా పడొచ్చు అని ఫిల్మ్ నగర్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. కరోనా, ఓమ్రికాన్ వెరియంట్లు ఎక్కువ అవుతుండటం పలు రాష్ట్రాల్లో  పరిమిత లాక్ డౌన్  విధించడంతో ముఖ్యంగా భారీ బడ్జెట్ చిత్రాలకు విపరీతమైన క్లిష్ట సమయం అని చెప్పొచ్చు.

అయితే కింగ్ నాగార్జున బంగార్రాజు చిత్ర విషయానికి వస్తె ఈ చిత్రం పక్కా ఫెస్టివల్ ఫిల్మ్. జనవరి 15 న రాబోతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. సోగ్గాడే చిన్ని నాయన చిత్రానికి సీక్వెల్ కాబట్టి ఈ చిత్రం తప్పకుండా అలరిస్తుందని తెలుస్తోంది.అలాగే సంక్రాంతి బరిలోకి రావాల్సిన F 3, వకీల్ షాబ్ చిత్రాలు కూడా రిలీజ్ పోస్ట్ ఫోన్ చేసేశారు. సంక్రాంతి సీజన్ అంటే భారీ బడ్జెట్ సినిమాలకు వసూళ్ల జాతర అని అందరికీ తెలిసిందే. ఓ వైపు కొలిక్కిరాని  సినిమా టికెట్ల వ్యవహారం, మరోవైపు కరోనా పుట్టిస్తున్న భయాందోళన, మరో వైపు ఓ టీ టీ ప్లాట్ ఫార్మ్ ల ట్రెండ్ నడుస్తుంటే భారీ రేంజ్ సినిమాలు దిక్కుతోచని స్థితిలో సతమత మవుతున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో  కొన్ని చిత్రాలు ప్రేక్షకుల్ని అలరించేందుకు రెఢీ అవుతున్నాయి. జనవరి 14 న మెగా అల్లుడు కళ్యాణ్ తాజాగా ఈ రేసులోకి దిగుతున్నాడు. పులి వాసు డైరెక్షన్ లో వస్తోన్న ఈ చిత్రం పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇదే విధంగా ఈ రేసు లోకి దూసుకొస్తున్న చిత్రం పద్మ శ్రీ.  జనవరి 22న ఈ చిత్రం రానుంది. ఎస్.ఎస్.పిక్చర్స్ బ్యానర్ పై, ఎస్.ఎస్. పట్నాయక్ రచన,దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలే ఉన్నాయి.హార్రర్, ఏక్షన్ తో పాటు థ్రిల్లింగ్ అంశాలు పుష్కలంగా ఉన్న ఈ చిత్రం కూడా  రిలీజ్ కు రెడీ అయింది.