ప్రస్తుతం రవితేజ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అందులో సుధీర్‌ వర్మ తెరకెక్కించనున్న కొత్త సినిమా ఉంది. అభిషేక్‌ పిక్చర్స్‌, ఆర్‌టీ టీం వర్క్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవితేజ 70వ చిత్రంగా రానున్న ఈ సినిమాకి ఇప్పటికైన‘రావణాసుర’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది. అయితే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న రవితేజ త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ను కూడా ప్రారంభించనున్నాడు.

ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించేందుకు తాజాగా  తాజాగా చిత్రబృందం ముహుర్తాన్ని ఫిక్స్ చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న ఉదయం 9:50 గంటల కిహైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌ వేదికగా ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుందని, మేకర్స్ ప్రకటించారు. అభిషేక్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై అభిషేక్‌ నామా ‘రావణాసుర’ చిత్రాన్ని నిర్మించనున్నారు. శ్రీకాంత్ విస్సా కథ రాశారు. కాగా, రవితేజ.. ‘ఖిలాడి’, ‘ధమాకా’, ‘రామారావు ఆన్‌ డ్యూటీ’, ‘టైగర్‌ నాగేశ్వరరావు’ చిత్రాలతో బిజీగా ఉన్నా