(Team India )టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ( Virat kohli ) ఇటీవల కాలంలో పెద్దగా రాణించడం లేదు. భారీ స్కోరు చేయలేకపోతున్న కోహ్లీ అభిమానులను నిరాశ పరుస్తున్నాడు. వెస్టిండీస్ తో (IND vs WI)జరిగిన వన్డే సిరీస్లో 24 పరుగులు మాత్రమే చేసిన కోహ్లీ ,ఇక మొదటి టీ 20( IND Vs WI T20 ) లో కూడా 17 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు .ఈ నేపథ్యంలో శ్రీలంకతో జరిగే టి20 సిరీస్ కి కోహ్లీ దూరం కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బిజీ షెడ్యూల్ వల్ల Kohli తన ఫామ్ కోల్పోయాడు .అందుకే శ్రీలంకతో జరిగబోయే టి 20 సిరీస్ నుండి తప్పుకొని విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నాడట. మరి దీనిపై బిసిసిఐ ఎలా స్పందిస్తుందో చూడాలి .ఫిబ్రవరి 24 నుండి శ్రీలంక తో టీ20 సిరీస్ మొదలుకానుంది. టీ 20 సిరీస్ కి దూరమవుతున్న కోహ్లీ మార్చి నెల నుండి మొదలయ్యే టెస్ట్ సిరీస్ లో పాల్గొంటాడని తెలుస్తోంది. ఇక గాయం కారణంగా వెస్టిండీస్ సిరీస్ కి దూరమైన రవీంద్ర జడేజా(Jadeja) శ్రీలంక సిరీస్ తో మళ్లీ జట్టులో చేరబోతున్నాడు.