టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది రష్మిక మందన (Rashmika mandana).ఇటీవల కాలంలో ఆమె నటించిన సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి .ఛలో సినిమాతో టాలీవుడ్(tollywood) లోకి అడుగు పెట్టిన రష్మిక ,భీష్మ తో మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వచ్చిన గీత గోవిందంతో సూపర్ హిట్ అందుకుంది .ఇక గీతా గోవిందం తరువాత విజయ్ దేవరకొండతో (Vijay devarakonda) డియర్ కామ్రేడ్ మూవీ లో కూడా ఆమె జోడిగా నటించింది .దాంతో వీరిద్దరి మధ్య ఏదో ఉంది అంటూ గుసగుసలు స్టార్ట్ అయ్యాయి .వీరిద్దరు లవ్ లో ఉన్నారని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపించాయి .ఈ విషయం మీద అటు విజయ్ దేవరకొండ (Vijay devarakonda)కానీ ఇటు రష్మీక (Rashmika) కానీ ఎప్పుడు స్పందించలేదు. కానీ లేటెస్ట్ గా రష్మిక మందన నటించిన చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు (ఆడవాళ్లు మీకు జోహార్లు ) ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండతో (Vijay devarakonda) ఎఫైర్ మీద వస్తున్న పుకార్లకు సమాధానమిచ్చారు. ఒక హీరోతో రెండు మూడు సినిమాలు కలిసి నటించినంత మాత్రాన ఇలాంటి పుకార్లను పుట్టించడం సరికాదని ఆమె తెలియజేశారు. హీరోలతో స్నేహంగా ఉన్నంత మాత్రాన వారితో ఎఫైర్ ఉన్నట్టు కాదని ,విజయ్ నేను మంచి ఫ్రెండ్స్ అని ఆమె తెలియజేశారు .దీంతో విజయ్ దేవరకొండతో వస్తున్న పుకార్లకు రష్మిక(Rashmika) చెక్ పెట్టినట్టే అయింది.