రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా అది ఒక సంచలనం అవుతుంది.వర్మ చేసే పనులు, మాట్లాడే మాటలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతాయి. దేశంలో ఎవరిపైన అయినా తనదైన స్టయిలో ట్వీట్స్ చేస్తూ విమర్శలకు తెరలేపుతారు RgV. తాజాగా ఒక యాంకర్ గురించి వర్మ చేసిన కామెంట్స్ ఇపుడు వైరల్ అయ్యాయి. తాజాగా బడవ రాస్కెల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. దాంట్లో పాల్గొన్న RGV యాంకర్ శ్యామలపై కామెంట్స్ చేసాడు.బేసిక్ గా అమ్మాయిల అందాలను పొగిడే వర్మ ఈ ఈవెంట్ లో కూడా అదే పని చేసాడు.ఇంత అందంగా ఉన్న మీరు నా కళ్ళలోంచి ఇన్నాళ్లు ఎలా తప్పించుకున్నారు’ అంటూ కామెంట్ చేశారు. దాంతో ఒక్కో శ్యామల షాక్ అయ్యింది.ఇక ఈవెంట్ లో భాగంగా యాంకర్ శ్యామల RGV ని తోపు, రౌడీ, గుండా అని పొగిడింది. దానికి ఆన్సర్ ఇచ్చిన RGV నువ్వు నన్ను తోపు, రౌడీ అన్నావు కానీ నేను వాటితో పాటు రాస్కెల్ కూడా’ అంటూ తనపైనే సెటైర్ వేసుకున్నారు.మొత్తానికి వర్మ ,శ్యామల మీద చేసిన కామెంట్స్ యుట్యూబ్ లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.