ఏస్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ రెడ్డి హీరో గా వచ్చిన చిత్రం, రౌడీ బాయ్స్.  ఆశిష్ రెడ్డి కి హీరో  గా, నటుడి గాను ఇదే తొలి చిత్రం.  అనుపమ పరమేశ్వరన్ ఈ చిత్ర కథానాయిక.

సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం యువతరాన్ని ఎంతగా ఆకట్టుకుందో అందరికీ తెలిసిన విషయమే.   సింగల్ స్క్రీన్స్ లో ఈ చిత్రం బాగా నడిచిందని చెప్పాలి.

హుషారు చిత్రాన్ని తెరకెక్కించిన హర్ష ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతనందించారు.

రౌడీ బాయ్స్ సందడి చేయడానికి మళ్ళీ వస్తున్నారు…అయితే  ఈసారి OTT లో.  మార్చ్ 11 నుండి జీ 5 లో stream కాబోతోంది. OTT ఆడియన్స్ ని ఏ విధం గా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.  అయితే OTT లో విడుదలైన ఒక నాలుగు వారాల లో ఈ సినిమాని జీ తెలుగు లో చూడవచ్చు