టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma )ఒకప్పుడు ఓవర్ వెయిట్ తో ఫీల్డింగ్ లో వెనకపడే వాడు.మైదానంలో లేజీగా కదులుతూ విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ ఇపుడు బ్యాటింగ్ తో పాటు ఫీల్డింగ్ లో కూడా సత్తా చాటుతున్నాడు. వెస్టిండీస్ తో( IND vs WI ) జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో కళ్ళు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. వెస్టిండీస్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో భారత బౌలర్ హర్షల్ పటేల్ (Harshal Patel )బౌలింగ్ వేశాడు. ఈ ఓవర్ కరేబియన్ బ్యాటర్ ఓడియన్ స్మిత్ మిడాప్ దిశగా భారీ షాట్ ఆడాడు. గాల్లోకి ఎగిరిన ఈ బంతిని అందుకునెందుకు రోహిత్ (Rohit Sharma)పరిగెత్తుకుంటూ వచ్చి డైవ్ చేస్తూ క్యాచ్ పట్టాడు. ఈ క్యాచ్ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఒకప్పుడు బద్ధకంతో మైదానంలో కదిలే రోహిత్ ఇపుడు ఫీల్డింగ్ అదరగొడుతున్నాడు.సూపర్ క్యాచ్ అందుకున్న రోహిత్ మీద ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక వెస్టిండీస్ తో జరిగిన మొదటి మ్యాచ్ భారత్ IND Vs WI)విజయం సాధించింది.