శర్వానంద్ (Sharwanand ), రష్మిక మందన (Rashmika )జంటగా నటిస్తున్న సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లు(Aadavallu meeku joharlu ). ఈ సినిమా ఈ నెల 25 విడుదల కావలసి ఉండగా భీమ్లానాయక్ ÷Bheemla Nayak )వంటి పెద్ద సినిమా వస్తుండటంతో శర్వనంద్ సినిమా మార్చి నెల 4 వ తేదీకి వాయిదా వేసారు.ఇప్పటికే విడుదలైన 3 సాంగ్స్ మంచి హిట్ గా నిలిచాయి. ఇక ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ 18 కోట్లు సొంతం చేసుకుంది.శర్వానంద్ కెరీర్ లో ఇదే హైయెస్ట్ ఫ్రీ రిలీజ్ బిజినెస్. ఇక ఈ మూవీ హిట్ అవ్వాలంటే దాదాపుగా 20కోట్లు వసూల్ చెయ్యాలి.
దర్శకుడు తిరుమల కిషోర్ (Tirumala Kishor )ఈ మూవీని యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ఇష్టపడేలా తియ్యడంతో సినిమాపై ధీమాగా ఉన్నారు చిత్ర యూనిట్ . రాదిక ,ఖుష్బూ ,ఊర్వశి వంటి సీనియర్ నటులు నటించటం విశేషం. మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా ఈ సినిమా ఉండనుంది. హీరోకి పెళ్లి చేయాలని తల్లి ప్రయత్నం చేయటం ,చివరికి ప్రతి అమ్మయితో సంబందం చెడిపోవటం పెళ్లి కోసం హీరో పడే పాట్లు కామెడీని పంచుతాయని తెలుస్తోంది. ఈ ఇక ఇప్పటివరకు వచ్చిన టీజర్ కి విశేష స్పందన లభించింది, త్వరలోనే అఫిషయల్ ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు.
Recent Comment