హీరో రామ్ పోతినేని (Ram Pothineni) ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి హిట్ ని సొంతం చేసుకుంన్నాడు.ఆ తరువాత రెడ్ అనే సినిమాలో కనిపించాడు .మరి ఇప్పుడు డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు.
మాస్ ఎంటర్ టైన్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న
ఈ సినిమాకు ది వారియర్ ( The warrior ) అని టైటిల్ ని ఖరారు చేసారు. రామ్ పోతినేని ఒక పోలిస్ ఆఫిసర్ పాత్రలో కనిపించబోతుంన్నాడు.ఇంతవరుకు రామ్ చేసిన పాత్రలకు ఇప్పుడు చేసే ఈ పాత్రకు చాల విభిన్నం ఉంటుందని సమాచారం .దాంతో ఇప్పుడు ఈ సినిమా పై భారి అంచనాలు పెరిగాయి..ఇప్పటికే విడుదలైన సినిమా పోస్టర్స్ ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్ఛింది. ఇటీవల రిలీజ్ చేసిన కృతి శెట్టి (Krithi shetty ) ఫస్ట్ లుక్ కూడా ఆకట్టుకుంది. ఈ సినిమా తెలుగు, తమిళ భాషలలో విడుదల కానుంది .ది వారియర్ (The warrior ) సినిమా ప్రేక్షకులను ఎంత వరకు అలరిస్తుందో చూడాలి.