ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా Radhe Shyam. సుమారు రెండు వందల కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కింది. Prabhas, Pooja Hegde మొదటిసారిగా కలిసి నటిస్తున్న ఈ చిత్రంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే టీజర్, ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకున్నాయి .ఇక వాలెంటైన్స్ డే సందర్భంగా మరో స్పెషల్ టీజర్ ని ప్రేక్షకులకు ఇవ్వబోతోంది మూవీ టీమ్. ఈరోజు మధ్యాహ్నం 1.43PM కి స్పెషల్ టీజర్ విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ఒక పోస్టర్ కూడా విడుదల చేశారు .ఈ పోస్టర్ లో prabhas, pooja hegde స్టైలిష్ లుక్ లో ఆకట్టుకున్నారు. ఒక వింటేజ్ ప్రేమ కథగా వస్తున్న radhe shyam మార్చి 11న వరల్డ్ వైడ్ గా విడుదల అవుతుంది. బాహుబలి తర్వాత వచ్చిన సాహో నిరాశపరచడంతో ప్రభాస్ radhe shyam మీద చాలా నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమాని తెలుగు, తమిళం ,కన్నడ ,హిందీ ,మలయాళ భాషల్లో ఒకే సారి దాదాపు 10 వేల థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు.radhe shyam తో ప్రభాస్ ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి.
Recent Comment