దేశవ్యాప్తంగా వ్యాప్తంగా కరోనా మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. దాంతో కొన్ని రాష్ట్రాలు కర్ఫ్యూ విధించాయి. పలు చోట్ల సినిమా థియేటర్స్‌ని మూసివేశారు. దీంతో పలు పాన్‌ ఇండియా చిత్రాలు విడుదలను వాయిదా వేసుకున్నాయి. ఇప్పటికే  జనవరి 7న విడుదల కావలసి ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని వాయిదా వేస్తూన్నట్లు ఇటీవల మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఈ క్రమంలోనే పాన్ ఇండియా  స్టార్‌ ప్రభాస్‌ నటించిన మూవీ ‘రాధేశ్యామ్‌’ కూడా వాయిదా పడొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. వాస‍్తవానికి ఈ మూవీ జనవరి 14న థియేటర్స్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావాల్సింది.  కానీ కరోనా కారణంగా ఈ సినిమా కూడా వాయిదా పడుతుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఇక తాజాగా రాధేశ్యామ్‌ దర్శకుడు రాధాకృష్ణ కుమార్‌  చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. ‘‘సమయాలు కఠినమైనవి, హృదయాలు బలహీనంగా, మనసులు అల్లకల్లోలంగా ఉన్నాయి. జీవితం మనపైకి ఏది విసిరినా ఆశలు ఉన్నతంగా ఉన్నాయి’’ అంటూ ట్వీట్‌ చేశారు. దీనికి స్పందించిన ఓ అభిమాని.. సినిమాను వాయిదా వేస్తున్నట్లు పరోక్షంగా చెబుతున్నావా అన్నా అని అడగగా.. అలాంటిదేమైనా ఉంటే అధికారికంగా చెబుతామని రాధాకృష్ణ ట్వీట్ చేశారు.