మాస్ రాజా రవితేజ వరుస సినిమాలతో దూకుడు మీద ఉన్నాడు. ఇటీవల khiladi సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన Raviteja ఇప్పుడు మరో అప్డేట్ ఇచ్చాడు .Ravi Teja ప్రస్తుతం నటిస్తున్న సినిమాలో Dhamaka ఒకటి. దర్శకుడు త్రినాధ రావు నక్కినేని డైరెక్షన్ లో మాస్ రాజా నటిస్తున్న చిత్రం Dhamaka. ఈ చిత్రానికి సంబంధించిన స్పెషల్ అప్డేట్ ని ప్రేమికుల రోజు సందర్భంగా ఈరోజు 11 గంటల 7 నిమిషాలకు విడుదల చేయబోతున్నారు.ఈ స్పెషల్ అప్డేట్ లో Ravi Teja ఫస్ట్ లుక్ లేదా స్పెషల్ టీజర్ ని రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా లవ్ మాస్ ఎంటర్ టైనర్ గా రాబోతోంది. గతంలో నేను లోకల్ ,సినిమా చూపిస్తా మావ లాంటి ఎంటర్టైన్మెంట్ ఫుల్ గా ఉండే సినిమాలు తీసిన త్రినాథరావు నక్కినేని ఈ సినిమాకు డైరెక్టర్ కావడంతో తో అంచనాలు భారీగా ఉన్నాయి. మరి ఈరోజు విడుదల చేసే అప్డేట్ తో ఆ అంచనాలు మరింత పెరిగే ఛాన్స్ ఉంది.