మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఖిలాడీ’. ‘ప్లే స్మార్ట్‌’ అన్నది ట్యాగ్‌ లైన్‌. రమేష్‌ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి కథానాయికలుగా నటిస్తున్నారు. డాక్టర్‌ జయంతిలాల్‌ గడ సమర్పణలో ఏ స్టూడియోస్, పెన్‌ స్టూడియోస్‌తో కలసి హవీష్‌ ప్రొడక్షన్‌పై సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకోంటోంది.

అయితే ఈరోజు నూతన  సంవత్సరం కానుకగా  ‘ఖిలాడీ’ చిత్రం నుంచి మేకర్స్ కొత్త పోస్టర్ ను విడుదల చేశారు.  తాజా పోస్టర్ లో రవితేజతో పాటు యాక్షన్ కింగ్ అర్జున్ ఎంతో ఎగ్రెస్సివ్ గా కనిపిస్తుండడం సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. కెరీర్ ప్రారంభం నుంచి భిన్నమైన చిత్రాలు చేస్తున్న రవితేజకు ‘ఖిలాడీ’ మరొక కొత్త తరహా సినిమా కానుందని తెలుస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా   ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. కాగా, ‘ఖిలాడీ’ చిత్రానికి కెమెరా: సుజిత్‌ వాసుదేవ్, జీకే విష్ణు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: మురళీకృష్ణ కొడాలి.