సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajanikanth) ఐశ్వర్య రాయ్(Aishwarya Rai ) జంటగా చేసిన రోబో బ్లాక్ బస్టర్ అయింది.2010 లో వచ్చిన రోబో ఇండియా వైడ్ గా రికార్డ్స్ బద్ధలు కొట్టింది.ఇక రజిని,ఐష్ జంటకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మళ్ళీ వీరు కలిసి నటించలేదు. కానీ ఇన్నాళ్లకు వీరి జంట మళ్ళీ నటించబోతున్నట్లు సమాచారం. ఇక
అన్నాతే సినిమా తర్వాత రజిని(Rajini kanth ), నెల్సన్‌కుమార్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. రజిని 169 (Rajini 169 )చిత్రానికి సంబంధించిన అధికార ప్రకటన వచ్చింది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

ఇక ఈ సినిమాలో రజినీకి హీరోయిన్ గా ఐశ్వర్య రాయ్ ని ఎంపిక చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ఇప్పటికే దర్శక నిర్మాతలు ఐష్‌తో(Aish) సంప్రదింపులు జరిపారని సమాచారం.ఐష్ కూడా మళ్లీ రజినితో చేయడానికి రెడీగా ఉన్నట్టు సమాచారం.మరి వీరి కాంబోలో వస్తున్న రెండో మూవీ ఎలాంటి విజయం సాధిస్తోంది చూడాలి.