మనకెందుకు మనకెందుకు అని మౌనంగా ఉండాలా….నా మౌనం చేతకాని తనం కాదు…చేవలేనితనం కాదు
మోహన్ బాబు గారు, అసలు మిమ్మల్ని మౌనం గా ఉండమని ఎవరు అన్నారో చెప్పగలరా. మీకు చేతగాదు, చేవలేదు అని ఎవరు అన్నారు. నిన్ను వద్దని వారించిన శ్రేయోభిలాషులు ఎవరు..? ఇప్పటిదాకా చేతులు ముడుచుకుని కూర్చున్నది మీరు.
సినిమా ఇండస్ట్రీ అంటే నలుగురు హీరోలు, నలుగురు ప్రొడ్యూసర్స్, నలుగురు డిస్ట్రిబ్యూటర్స్ కాదు. కొన్ని వేల మంది ఆశలు, కొన్నివేల కుటుంబాలు, కొన్నివేల జీవితాలు. ఈ విషయం ఇప్పటికైనా తెలుసుకున్నందుకు ధన్యవాదాలు. సినిమా ఇండస్ట్రీ అంటే నలుగురు హీరోలు, నలుగురు ప్రొడ్యూసర్స్, నలుగురు డిస్ట్రిబ్యూటర్స్ అని ఎవరు అన్నారు. మోహన్ బాబు గారు మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడుతున్నారు. మీ లేఖలో ఫ్రస్ట్రేషన్ ఎక్కువగా కనబడుతోంది.
47 సంవత్సరాల అనుభవం ఉన్నవారు, ఇన్ని సంవత్సరాలు ఎం చేశారు. శ్రేయోభిలాషు లు వద్దని వారించారంటున్నారు. ఇన్ని సంవత్సరాల అనుభవం ఉన్న మీరు, సొంతంగా నిర్ణయం తీసుకోలేరా. ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు మీ మీద మీకు నమ్మకం ఉండాలి..ఎవరో చెప్పారని మీరు ఆగిపోవడమేంటి.
సమస్యలను అందరూ కూర్చుని చర్చించుకున్నాక ముఖ్యమంత్రిని కలవాలన్నారు. ఇప్పటిదాకా చర్చలు లేకుండా, ఏం చేయాలో తెలియకుండానే అందరు మంత్రులను కలిశారా…అప్పుడు మీరు ఎక్కడికెళ్లారు సర్. ఇప్పుడు కూడా మీరే ముందుండి అందరిని కలుపునుకుని ముందుకెళ్ళండి మోహన్ బాబు గారు…ఎవరు వద్దన్నారు
సినిమా ఇండస్ట్రీ లో అందరు సమానం ….ఏ ఒక్కరి గుత్తాధిపత్యం కాదు….. ఇవన్నీ అందరికి తెలిసినవే. కొత్తగా ఏమైనా చెప్పండి. మీ మనసులో ఏముందో చెప్పండి
సినిమా టిక్కెట్ల విషయం ఎప్పటి నుంచో జరుగుతుంటే నీకు ఇప్పుడు మెలకువ వచ్చిందా….మోహన్ బాబు. మీ లేఖ అంత మీ సెల్ఫ్ డబ్బా, మీ ఫ్రస్ట్రేషన్ తప్ప ఏమి లేదు. లేఖలు రాయడం వల్ల ఏమి ఉపయోగం లేదు. మీ ఫ్రస్ట్రేషన్ అందరికి తెలియడం తప్ప. మొదటి నుంచి మీ కుళ్ళు అంత చిరంజీవి మీదనే కదా…ఎవరికీ తెలియదు
మాట్లాడితే అన్ని సంవత్సరాల అనుభవం ఉంది, ఇన్ని సినిమాలు చేశా అనే కన్నా, మీ అనుభవాన్ని, సమస్యలను పరిష్కరించుకోవటానికి ఉపయోగించండి.
లేఖలు రాయటం ఆపేసి, పని చేయడం మొదలు పెట్టండి. మీ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించండి.
Recent Comment