సరిలేరు నికెవ్వరు బ్లాక్ బస్టర్ తరువాత మహేష్ బాబు నుండి వస్తున్న చిత్రం sarkaaru Vaari Paata . కీర్తి సురేష్ ,మహేష్ బాబుకి జోడిగా నటిస్తోంది. మే 12న భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్ అవుతోంది. ఇక ఈ మూవీ నుండి కళావతి అనే సాంగ్ ని ఈరోజు సాయంత్రం 4: 05 కి విడుదల చేస్తున్నారు. నిజానికి ఈ పాట రేపు విడుదల కావాలి. కానీ ముందుగానే నెట్ లో ఫుల్ సాంగ్ లీక్ కావడంతో మేకర్స్ ఈరోజు సాయంత్రమే ఒరిజినల్ ఫుల్ సాంగ్ ని రిలీజ్ చేస్తున్నారు. ఈ పాట ప్రోమోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. విడుదల అయిన కొద్దీ గంటల్లోనే 5 మిలియన్ వ్యూస్ సాధించింది. ఇక ఈరోజు విడుదల అవుతున్న kalavathi Full Original Song ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తోందో చూడాలి.బ్యాంకుల్లో జరిగే కుంభకోణాల నేపథ్యంలో దర్శకుడు పరుశురాం ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.మైత్రి మూవీ మేకర్స్, GMB Entertainments ,14 రీల్స్ వారు సంయుక్తంగా sarkaaru vaari pata చిత్రాన్ని నిర్మిస్తున్నారు.