టాలీవుడ్ లో లీకులు బెడద ఎక్కువ అవుతోంది. పెద్ద హీరోల సినిమాలలో సీన్స్ ,పాటలు ముందుగానే లీక్ అవుతున్నాయి. ఇపుడు సర్కారు వారి పాట మూవీ నుండి కళావతి సాంగ్ కూడా లీక్ అయ్యింది. దీనిపై సంగీత దర్శకుడు తమన్ ఎమోషనల్ అయ్యాడు.Kalavathi Song కోసం 1000 మంది దాదాపు ఆరు నెలలో కష్టపడ్డాం అని కానీ ఒక్క నిమిషములో మా కష్టాన్ని ఇలా నెట్ లీక్ చేసారని తమన్ ఆవేదన వ్యక్తం చేశారు. మూవీ విషయంలో ఎంత కేర్ తీసుకున్న ఇలాంటీ లీకులు తప్పడం లేదని mahesh babu ఫ్యాన్స్ కి సారి చెప్పాడు S Thaman.నమ్మి పని ఇస్తే ఇలాంటి పని చేసారని మళ్ళీ ఇలాంటి పొరపాట్లు రాకుండా జాగ్రత్తగా ఉంటానని తెలిపారు.ఇక Sarkaaru vaari paata మూవిలో kalavathi song స్పెషల్ గా ఉంటుందని, ఈరోజే ఫుల్ సాంగ్ విడుదల చేస్తామని తమన్ తెలియ చేసారు. కళావతి సాంగ్ లో మహేష్ ,కీర్తి సురేష్ జంటకి మంచి మార్కులు పడుతున్నాయి. sarkaaru vaari paata మూవీ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని mahesh babu అభిమానులు నమ్మకంగా ఉన్నారు.మే 12న ఈ మూవీ థియేటర్స్ లో విడుదల కానుంది.