పవర్ ష్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా సినిమా బీమ్లానాయక్ . ఈ నెల 25న ఈ సినిమా రిలీజ్ కానుందని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇప్పుటి వరకు విడుదలైన బీమ్లా నాయక్ పోస్టర్ లు ,టీజర్స్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. పవన్ కల్యాణ్ స్టయిల్ ఫ్యాన్స్ కి మంచి కిక్కుని అందిస్తున్నాయి.ఇక ఈ మూవీ నుండి ప్రమోషనల్ సాంగ్ ని విడుదల చేయబోతున్నారు.25వ తేదీ సినిమా విడుదల ఉండడంతో ప్రమోషన్ జోరు పెరిగింది. ఇక నిథ్యామీనన్ ,పవన్ కి హీరోయిన్ గా కనిపిచనుంది. రాణా ప్రతినాయకుడు పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాకు త్రివిక్రమ్ మాటలు అందించగా తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక తమన్ అందించిన పాటలు మంచి హిట్టు అందుకున్నాయి. మళయాళం లో హిట్టుగ నిలిచిన అయ్యప్పనుమ్ కోషియం కు రీమెక్ గా వస్తోంది భీమ్లానాయక్.ఇక ట్రైలర్ ని కూడా త్వరలోనే విడుదల చేయనున్నారు. భీంలా నాయక్ బరిలోకి దిగడంతో 25 న రిలీజ్ అవుతున్న మిగతా సినిమాలు కంగారు పడుతున్నాయి.