రాం చరణ్(Ram charan ) ,శంకర్ (Shankar )దర్శకత్వంలో వస్తున్న క్రేజీ(RC15) మూవీపై ఇప్పటి నుండే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పాన్ ఇండియా స్థాయిలో శంకర్ కి క్రేజ్ ఉంది.ఆయన తీసిన రోబో, ఐ ,రోబో 2 చిత్రాలు బాలీవుడ్ లో వందల కోట్లు కలెక్ట్ చేశాయి. ఇపుడు అదే స్థాయిలో రాం చరణ్(Ram charan ) తో మూవీ తీస్తున్నాడు శంకర్. ఇక ఈ మూవీ హిందీ రైట్స్ కి భారీ ధర పలికినట్టు సమాచారం. హిందీ థియేట్రికల్ రైట్స్ అలాగే డిజిటల్ రైట్స్ మొత్తం కలిపి ఒక భారీ నిర్మాణ సంస్థ 350 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.ఫస్ట్ లుక్ రిలీజ్ కాకుండానే(RC15) ఈ స్థాయిలో బిజినెస్ జరగడం ఒక రికార్డ్ అని చెప్పాలి.ఇక ఈ చిత్రాన్ని దిల్ రాజు (Dil raju)భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కైరా అద్వానీ(Kaira Advani), చరణ్ కి జోడిగా నటిస్తోంది. సునీల్ (Sunil)తో పాటు బాలీవుడ్ నటులు కూడా ఈ మూవీలు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. రాజకీయ నేపథ్యంలో rc15 చిత్రాన్ని శంకర్ తెరకెక్కిస్తున్నారు