టీమ్ ఇండియా ,వెస్టిండీస్ జట్ల మధ్య ప్రస్తుతం టీ 20 సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే.దీని తరువాత శ్రీలంక తో సిరీస్ ఆడనుంది భారత్.ఇపుడు ఈ సిరీస్ లో మార్పులు చేసారు. మొదట్లో టెస్ట్ ఆ తరువాత టి 20 సిరీస్ నిర్వహించాలని షెడ్యూల్ ప్రకటించారు.
తాజాగా వాటిలో మార్పులు చేశారు. మొదటగా టి 20 సిరీస్ జరపాలని బిసిసిఐ నిర్ణయించింది.ఫిబ్రవరి 24 నుండి 27 వరకు టీ 20 సిరీస్ జరగనుంది. ఇక ఆ తరువాత మార్చ్ 4 నుండి 16 వరకు టెస్ట్ సిరీస్ జరగనుంది.
ఇక వెస్టిండీస్ తో వన్డే సిరీస్ గెలిచిన భారత్ ఇపుడు టి 20 సిరీస్ మీద దృష్టి పెట్టనుంది.బుధవారం నుండి టి 20 సిరీస్ స్టార్ట్ కానుంది. రోహిత్ సేన పటిష్టంగా ఉండడంతో టీ 20 సిరీస్ లో టీమ్ ఇండియా ఫెవేరేట్ బరిలోకి దిగుతోంది.ఇక Kl రాహుల్ టి 20 సిరీస్ కి దూరం అవ్వడంతో రిషబ్ పంత్ ని టీమిండియాకి వైస్ కెప్టెన్ చేసిందీ బిసిసిఐ.