ఆంధ్ర ప్రదేశ్ (Andhra pradesh ) లో మరో రాజకీయ మంత్రి చనిపోయారు.ap ఐటీ,పరిశ్రమలు శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి (Mekapati goutham Reddy )గుండెపోటుతో మరణించారు. సోమవారం ఉదయం ఆయనకు గుండెలో నొప్పి రావడంతో ఒక్కసారిగా కింద పడిపోయాడు. దాంతో
ఆయన్ని కుటుంబ సభ్యులు హాస్పిటల్ కి తీసుకెళ్లారు.డాక్టర్లు గౌతమ్ రెడ్డిని ICU లో చికిత్స అందించారు.అయినా కూడా ఫలితం లేదు. అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ గౌతమ్ రెడ్డి(Goutham Reddy ) మరణించారు. గౌతమ్ రెడ్డి అత్మకూరు నియోజకవర్గం MLA గా గెలిచారు. ఆయన మరణంతో పలు రాజకీయ నాయకులు సంతాపం తెలుపుతున్నారు.