నందమూరి బాలకృష్ణ(Balakrishna) తన 107వ సినిమా(NBK 107) మొదలు పెట్టాడు. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ఈ మూవీ రాబోతోంది.ఇటీవల ఈ మూవీ ఒక మాస్ ఫైట్ తో మొదలయింది. ఇపుడు ఈ మూవీ గురించి ఒక న్యూస్ హల్ చల్ చేస్తోంది. అఖండకి బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చిన తమన్(S Thaman ) బాలయ్య (NBK 107 ) 107వ మూవీకి కూడా సంగీతం ఇస్తున్నాడు. ఇక ఈ మూవీలో పాటలు మాస్ ప్రేక్షకులకు నచ్చేలా ఉంటాయట.

ఇక ఈ మూవీలో ఒక ఐటమ్ సాంగ్ కూడా ఉందట. ఆ పాట అన్ని పాటలకంటే హైలెట్ గా నిలుస్తుందట. ఇప్పటికే ఈ మూవీకి సంబంచిన పాటలను తమన్ మొదలు పెట్టారు. ఈ పాట రిలీజ్ అయ్యాక ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి.ఇక ఈ మూవీలో బాలయ్యకి(Balakrishna) జోడిగా శృతి హాసన్(Shruthi hassan ) నటిస్తోంది. వరలక్ష్మి శరత్ కుమార్(Varalakshmi sharath kumar ),దునియా విజయ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. దసరా సందర్భంగా ఈ మూవీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.