ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్-క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్గా నటించింది. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ మంచి వసూళ్లు రాబడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే రూ. 300కోట్ల వసూళ్లను సాధించింది.
ఈ నేపథ్యంలో తాజాగా ‘పుష్ప’ మూవీ గురించిన మరో క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ చిత్రం ఓటీటీలో ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది. 2022 సంక్రాంతి కానుకగా ఈ సినిమా ఓటీటీలో ప్రసారం కానున్నట్లు సమాచారం. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో పుష్ప స్ట్రీమింగ్ కానుందట. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.
కాగా, ఈసినిమాలో పుష్ప రాజ్ పాత్రలో అల్లుఅర్జున్ ఊర మాస్ యాక్టింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంస్థలు నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైంది. ఈ సినిమా రెండో భాగం ‘పుష్ప: ది రూల్’ షూటింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది.
Recent Comment