పవర్ స్టార్  పవన్ కళ్యాణ్,  టాలీవుడ్ హంక్ రాణా దగ్గుబాటి కాంబోలో వస్తోన్న క్రేజీ ప్రాజెక్ట్  భీమ్లా నాయక్. సాగర్ కే చంద్ర  డైరెక్షన్ లో వస్తోన్న ఈ మూవీ  సంక్రాంతి బరిలోకి వస్తుందని అంతా ఆశించారు. నిర్మాత కూడా భీమ్లా నాయక్ ను ఎంత పోటీ ఉన్నా కూడా ఖచ్చితంగా సంక్రాంతికే రిలీజ్  చేస్తామనే పలు సందర్బాల్లో ప్రకటించారు. కాని భీమ్లా నాయక్ ను రాధే శ్యామ్ మరియు ఆర్ఆర్ఆర్ సినిమాల కోసం రిలీజ్ పోస్ట్ పోన్ వేసేందుకు పవన్  ఒప్పుకున్నారు. కొన్ని రోజుల తేడాతో భీమ్లా నాయక్ ఆ తర్వాత నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ అంచనాల నడుమ రూపొందిన భీమ్లా నాయక్ నుండి ఇప్పటికే వచ్చిన పాటలు సినిమా స్థాయిని పెంచేశాయి. ఈ చిత్రానికి థమన్ సంగీతం చాలా హైలెట్ గా నిలవనుంది.

రీసెంట్ టైమ్స్ లో  ఈ యంగ్ సెన్సేషన్ మ్యూజిక్  అందించిన చిత్రాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ రేంజ్ రీసౌండ్ ఇవ్వటం వలన తమన్ క్రేజ్ అమాంతం పెరిగిపోతోంది.ఈ క్రమం లో ఈ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ డిసెంబర్ 31 నాడు చేయబోయే భీమ్లా నాయక్ డి జే వెర్షన్ సౌండ్ తో జోష్ నింపేందుకు రెఢీ అవుతున్నారు. మరి ఆ వివరాలేంటో మీరు చూడండి.భీమ్లా నాయక్ చిత్రంలో ఇప్పటికే విడుదలైన పాటలకు ట్రేమండస్ రెస్పాన్స్ వస్తోంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్రాండ్ ఇమేజ్ రేంజ్ ను మైండ్ లో పెట్టుకుని  థమన్ భీమ్లా నాయక్ కు దుమ్మురేపే మ్యూజిక్ ఇచ్చారు. ప్రతి సాంగ్  యూట్యూబ్ లో ట్రెండ్ సెట్ చేశాయి. ముఖ్యంగా భీమ్లా నాయక్ లాలా భీమ్లా నాయక్ పాట ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో చెప్పనక్కర్లేదు. యూత్ లో సంచలనం సృష్టిస్తున్న ఈ పాట  మరో వర్షన్ ను న్యూ ఇయర్ పార్టీ రూపంలో ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చేందుకు సన్నాహాలు చేశారు. ఇటీవల కాలంలో వస్తున్న  అన్ని పాటలకు డీజే వర్షన్ లు వస్తున్నాయి. అయితే కొన్ని పాటల డీజే వర్షన్ లు సూపర్ సక్సెస్ అయ్యాయి.

సాదారణంగానే ఆ పాట వీర మాస్.. ఊర మాస్ అన్నట్లుగా ఉంది. ఇక డీజే వర్షన్ లో ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. భీమ్లా నాయక్ సినిమా లో డీజే మిక్స్ పాట ఉండక పోవచ్చు. కానీ డిసెంబర్ 31వ తారీకు రాత్రి 7 గంటల సమయంలో విడుదల కాబోతున్న ఈ పాట ఆ రోజు రాత్రి పార్టీ ల్లో.. పబ్ ల్లో బాక్స్ లు బద్దలు చేయడం ఖాయం అంటూ అభిమానులు ధీమాగా ఉన్నారు. అలాగే కొత్త ఏడాదికి భీమ్లా నాయక్ డీజే మిక్స్ పాటతో వెల్ కమ్ చెప్పేందుకు గాను అభిమానులు సిద్దంగా ఉన్నారు. థమన్ డీజే మిక్స్ సాంగ్ ఖచ్చితంగా సినిమా స్థాయిని మరింతగా పెంచే అవకాశం ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.