తెలంగాణలో (Telangana)మేడారం (Medaaram)సమ్మక్క సారాలమ్మ దేవాలయం(Samakka Saralamma Temple ) ఎంత పాపులర్ అన్నది అందరికి తెలిసిందే. సామాన్య భక్తులతో పాటు ,రాజకీయ నాయకులు కూడా అమ్మవార్లను దర్శించుకుంటారు. ఇక తెలంగాణ(Telamgana ) కాంగ్రెస్ పార్టీ చీఫ్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి(Revanth reddy ) శనివారం మేడారంలోని సమ్మక్క-సారలమ్మ వనదేవతలను దర్శించుకోనున్నారు.దాంతో కాంగ్రెస్ నాయకులు ఆయనకి ఘన స్వాగతం పలికేందుకు సిద్దం అయ్యారు.జిల్లా పరిధిలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు.అలాగే రేవంత్ రెడ్డి మేడారం వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. అమ్మవార్లకు పూజ చేసిన అనంతరం రేవంత్ రెడ్డి( Revanth reddy ) మీడియాతో మాట్లాడనున్నారు.