అల్లు అర్జున్ సినిమాలలో పాటలకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.  2020 లో వచ్చిన అల వైకుంఠపురం లో బుట్ట బొమ్మ సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో మనందరికీ తెలిసిందే.

2021 లో వచ్చిన పుష్ప లో శ్రీ వల్లి పాటలో అల్లు అర్జున్ నటన, రష్మిక హావ భావాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి.  చంద్రబోస్ సాహిత్యం, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఈ పాటను 2021 లో నెం.1 గా నిలబెట్టాయి.  వీటికి తోడు సిద్ శ్రీరామ్ గాత్రం ఈ పాటకు పెద్ద అసెట్.

2021 చివర లో వచ్చిన పుష్ప ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనందరికీ తెలుసు.  ముఖ్యం గా ఈ సినిమా 2021 లో బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.  ఈ సినిమా లో తగ్గేదే లే డైలాగు ఎంత పాపులర్ అయ్యిందో శ్రీ వల్లి సాంగ్ కూడా అంత పాపులర్ అయ్యింది. ఇప్పుడు ఈ పాట పూర్తి వీడియో మేకర్స్ విడుదల చేశారు.  మీరు ఎంజాయ్ చేయండి.