ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu arjun ) ,సుకుమార్(Sukumar ) కాంబినేషన్ లో వచ్చిన పుష్ప (Pushpa )ఎలాంటి సంచలన విజయం సాధించిందో అందరికి తెలిసిందే .రిలీజ్ ముందు నుండి సినిమాపై న భారీ అంచనాలు ఉన్నాయి. పుష్ప(Pushpa ) విడుదల అయ్యాక కూడా అదే స్థాయిలో కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. దాదాపు దేశం మొత్తం 350 కోట్లకు పైగా వసూలు చేసి బన్నీ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక ఈ మూవీకి పార్ట్ 2(Pushpa The Rule ) ని తెరకెక్కిస్తున్నారు. థియేటర్స్ లో సూపర్ హిట్ అయిన పుష్పకి మరో అరుదైన గౌరవం దక్కింది.

బన్నీ(Bunny) ,సుకుమార్(Sukumar ) కాంబోలో వచ్చిన పుష్పకి (Pushpa )ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్ 2022ని సొంతం చేసుకుంది. బాలీవుడ్ చిత్రాలతో పోటీ పడి మరీ పుష్ప ది రైజ్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపిక అయ్యింది. పుష్ప మూవీకి ఆ అవార్డ్ రావడంతో చిత్ర యూనిట్ తో పాటు అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.