శర్వానంద్ ,రష్మిక మందన జంటగా వస్తున్న లేటెస్ట్ మూవీ ఆడవాళ్లు మీకు జోహార్లు. క్రేజీ డైరెక్టర్ తిరుమల కిషోర్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 25న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది .ఈ క్రమంలో Aadavallu meeku Joharlu Movie ప్రమోషన్ భారీగా చేస్తున్నారు .ఇటీవల రిలీజైన మొదటి పాట అలాగే టీజర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది .ఇప్పుడు వాలెంటెన్స్ డే సందర్భంగా మరో పాటను విడుదల చేశారు . ఓ మై ఆద్య అంటూ హీరోయిన్ ప్రేమ కోసం Sharwanand పాడే పాటను విడుదల చేశారు .ఈ పాట ఇప్పుడు యూట్యూబ్లో ఆకట్టుకుంటుంది .ఈ పాటను శ్రీమణి రాయగా , గాయకుడు యాజిన్ నిజార్ అద్భుతంగా పాడారు. ఇక ఈ పాటికి తనదైన స్టైల్లో మ్యూజిక్ అందించాడు దేవి శ్రీ ప్రసాద్.oh my Adhya పాటలో sharwanand, Rashmika జోడి ఆకట్టుకుంది .టీజర్ తో పాటు పాటలు కూడా చాలా ఫ్రెష్ గా ఉండడంతో ఆడవాళ్లు మీకు జోహార్లు Aadavallu Meeku Joharlu సినిమా పై పాజిటివ్ బజ్ ఏర్పడింది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఫిబ్రవరి 25న థియేటర్స్ వస్తున్న Sharwanand ఎలాంటి హిట్ అందుకున్నాడు చూడాలి