తెలంగాణ వైద్య శాఖ మంత్రి హరీష్ రావు నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. త్వరలోనే డాక్టర్లు ,నర్శింగ్ పోస్ట్ లు భర్తీ చేస్తామని తెలిపారు.వరంగల్ పర్యటనలో ఈ హామీ ఇచ్చారు మంత్రి హరీష్ రావు.వరంగల్ లో MGM Hospital లో డయాగ్నోస్టిక్ సెంటర్ను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో లో ఆసక్తికరమైన అంశాలు వెల్లడించారు. cm kcr వైద్య శాఖ మీద ,ప్రజల ఆరోగ్య మీద ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు.త్వరలోనే కొత్తగా 8 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.అలాగే భర్తీ చేయని డాక్టర్లు, నర్శింగ్ పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు. డాక్టర్స్ ,నర్సింగ్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఇక ఇదే కార్యక్రమంలో ప్రధాని మోడీ మీద ఫైర్ అయ్యారు మంత్రి.తెలంగాణ ప్రభుత్వం మీద మోడీ ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని తెలంగాణ అభివృద్ధి కేంద్ర కూడా సహాయం చెయ్యాలని తెలిపారు.