శ్రీలంకతో (IND vs SL )జరిగే టెస్ట్ సిరీస్ కి కెప్టెన్ మార్చింది బిసిసిఐ. ప్రస్తుతం సారధిగా ఉన్న కోహ్లీని(Kohli ) తప్పించి ఇపుడు రోహిత్(Rohit) ని కెప్టెన్ చేసింది. మార్చ్ నెలలో శ్రీలంకతో టెస్ట్ సిరీస్ జరగనుంది.ఈ సిరీస్ కి కోహ్లీ విశ్రాంతి లభించడంతో రోహిత్(Rohit Sharma) ని కెప్టెన్ చేశారు. అలాగే బౌలర్ బుమ్రాని వైస్ కెప్టెన్ ని చేశారు.
పుజారా, రహానేలను టెస్ట్ జట్టులో స్థానం ఇవ్వలేదు. శ్రీలంకతో టెస్టు సిరీస్ కి వీరిని తప్పించింది. బీసీసీఐ(BCCI) సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ రోహిత్ ని కెప్టెన్ గా ప్రకటన చేశారు.ఇక ఈ సిరీస్ కి కీపర్ రిషబ్ పంత్(Rishab Pant) కి కూడా విశ్రాంతి ఇచ్చారు. ఇక వన్డే ,టీ 20 సిరీస్ లను గెలిపిస్తున్న రోహిత్ టెస్ట్ సిరీస్ ను గెలిపిస్తాడేమో చూడాలి.