భారత్ , వెస్టిండీస్ జట్ల మధ్య కలకత్తాలో మొదటి టి 20 మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన భారత్ మొదటగా బౌలింగ్ ఎంచుకుంది.భారత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో వెస్టిండీస్ 20 ఓవర్లో 7 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది.దాంతో టీమిండియాకి 158 పరుగుల లక్ష్యం ఉంచింది.వెస్టిండీస్ బ్యాటర్లలో నికోలస్ పూరన్ 61 పరుగులతో అర్థ సెంచురి చేయగా మాయెర్స్ 31 పరుగులు కిరణ్ పొలార్డ్ 24 పరుగులు చేశారు.ఈ ముగ్గురు రాణించడంతో వెస్టిండీస్157 పరుగులు చేసింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ ఒకటి దీపక్ ఛాహార్ 1 ,హర్షల్ పటేల్ 2 ,యజువేంద్ర ఛాహల్ 1 ,రవి బిష్ణో 2 వికెట్లు తీశారు.ఇక టీమిండియా 158 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కి దిగుతోంది. ఈ మ్యాచ్ లో విజయం కోసం భారత్ పోరాడుతోంది.