హీరో వెంకటేశ్‌ మంచి జోష్‌లో ఉన్నారు. సినిమాల మీద సినిమాలను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఎప్ 3 సినిమా చేస్తున్నారు. యంగ్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ప్ర‌స్తుతం ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉంది. మ‌రో వైపు వెంకీ రానా నాయుడు అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు. వెంకీ, రానా క‌లిసి చేస్తున్న ఈ వెబ్ సిరీస్ పై ఫ‌స్ట్ నుంచి మంచి క్రేజ్ ఉంది. అయితే.. ఎఫ్ 3 త‌ర్వాత వెంకీ చేసే సినిమా ఏంటి అనేది మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ లేదు.

తాజా సమాచారం ప్రకారం జాతిర‌త్నాలు సినిమా డైరెక్ట‌ర్ అనుదీప్. ఇటీవల వెంకీకి ఓ స్టోరీ చెప్పార‌ట‌. ఈ క‌థ వెంకీకి తెగ న‌చ్చేసింద‌ట‌. వెంట‌నే ఈ సినిమా చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని స‌మాచారం.
కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పై యువ నిర్మాత నాగవంశీ నిర్మించనున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ ప్రాజెక్టు పై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అనుదీప్ ప్రస్తుతం త‌మిళ హీరో శివ కార్తికేయన్‌తో తెలుగు తమిళ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అతను ప్రస్తుత ప్రాజెక్ట్ పూర్తి చేసిన తర్వాత వెంకటేష్‌తో చిత్రం సెట్స్ పైకి వెళ్తుంది. గ‌తంలో వెంకీ సితార ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ లో బాబు బంగారం అనే సినిమా చేశాడు. వెంకీ, అనుదీప్ క‌లిసి సినిమా చేయ‌నున్నార‌ని తెలిసిన‌ప్ప‌టి నుంచి ఈ ప్రాజెక్ట్ పై మంచి క్రేజ్ ఏర్ప‌డింది.