తెలుగు సినీపరిశ్రమలో పెద్దగా ఉండడం నాకిష్టం లేదు, నాకు.. కానీ బాధ్యత గల సినిమాతల్లిన బిడ్డగా ఉంటాను. అవ‌స‌రం వ‌చ్చిన‌ప్పుడు నేనున్నాంటూ ముందుకు వ‌స్తాను. అంతే కానీ,  ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను దృష్టిలో పెట్టుకునో, రెండు యూనియ‌న్స్‌ను దృష్టిలో పెట్టుకునో,న‌న్ను పంచాయ‌తీ చేయ‌మంటే నేను చేయ‌ను. అలాంటి పెద్ద‌రికం నాకొద్దు అంటూ మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారిన విషయం తెలిసిందే.

అయితే మెగాస్టార్ చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌ తనదైన శైలిలో స్పందించారు. చిరంజీవి చేసిన వ్యాఖ్యలను బండ్ల గణేష్‌ సమర్థిస్తూ.. ‘సూపర్‌ సర్‌.. బాగా చెప్పారు’ అంటూ తన ట్విటర్‌ అకౌంట్‌లో షేర్‌ చేశారు. ఈ క్రమంలోనే  చిరంజీవి మాట్లాడిన మాటలను పునరావృతం చేస్తూ ఈ ట్వీట్‌  చేశాడు బండ్ల గణేష్‌. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కాగా, మెగా ఫ్యామిలీపై బండ్ల గణేశ్‌కు ఎంత ప్రేమ ఉంటుందో అందరికి తెలిసిన విషయమే. మెగా హీరోలపై ఎవరైన  కామెంట్స్‌ చేస్తే.. తనదైన రీతిలో కౌంటర్ ఇచ్చేస్తాడు.