టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ (varun tej ) నటిస్తున్న క్రేజీ మూవీ గని(Ghani) ఈ మూవీపై టాలీవుడ్లో మంచి అంచనాలే ఏర్పడ్డాయి .మొదటిసారి వరుణ్ తేజ్ (Varun tej ) బాక్సర్ గా నటిస్తున్నాడు. చాలా కాలం తర్వాత తెలుగులో బాక్సింగ్ నేపద్యంలో సినిమా వస్తుండడంతో గని(Ghani) మూవీ మీద అంచనాలు పెరిగాయి. ఇటీవల విడుదల చేసిన పాటలు ,పోస్టర్స్, టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ట్రైలర్ విడుదల చేసేందుకు సిద్ధం అయింది. ఈ సినిమాని ఫిబ్రవరి 25న వరల్డ్ వైడ్ గా విడుదల చేసేందుకు డేట్ కూడా ప్రకటించారు. దాంతో మూవీ ప్రమోషన్ పెంచడానికి మరో రెండు రోజుల్లో గని ట్రైలర్ విడుదల చేయబోతున్నట్లు సమాచారం .ఈ మూవీలో కన్నడ నటుడు ఉపేంద్ర ,అలాగే బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ (S thaman ) సంగీతాన్ని అందిస్తున్నాడు, ఈ మూవీలో తమన్నా ఒక అదిరిపోయే ఐటమ్ సాంగ్ చేసింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై కిరణ్ కొర్రపాటి అనే కొత్త దర్శకుడు గని సినిమా తెరకెక్కించాడు .భారీ అంచనాలతో వస్తున్న varun tej గని ఎలాంటి హిట్ సాధిస్తాడో చూడాలి.