వరుణ్ తేజ్ ( Varun tej )నటించిన గని (Ghani)చిత్రం ప్రేక్షకుల ముందుకు రావటానికి రెడీగా ఉంది.బాక్సింగ్ నేపథ్యంలో ఉండే ఈ సినిమాకి అల్లు అరవింద్ తనయుడు అల్లు బాబీ నిర్మాత గా వ్యవహరిస్తున్నాడు.ఈ సినిమాలో వరుణ్ తేజ్ కి జంటగా సాయి మంజ్రేకర్ కథనాయకగా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 25న థియేటర్స్ లలో సందడి చేయనుంది.ఇక అదే రోజున పవన్ కళ్యాణ్ (Pawan Kalyan ) భీంలా నాయక్( Bheemla Nayak ) సినిమా కూడా రీలిజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. భీంలా నాయక్ లాంటి పెద్ద సినిమాతో పోటిపడాలా వద్దా అని ఆలోచనలో పడ్డారూ గని(Ghani) టీమ్.ఇప్పటికే 25న విడుదల కావాల్సిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran abbavaram )మూవీ సెబాస్టియన్( sebastian ) విడుదల వాయిదా వేసుకున్నారు. మరి విడుదలకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న వరుణ్ తేజ్ గని (Ghani)థియేటర్స్ లోకి వస్తాడా లేదా వాయిదా వేసుకుంటాడా అన్నది ఆసక్తిగా మారింది.
Recent Comment