మాస్ రాజా రవితేజ ( Ravi teja ) తాజాగా నటించిన చిత్రం ఖిలాడి(Khiladi). భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ గతవారం థియేటర్స్ లో రిలీజ్ అయింది .ఇక ఈ మూవీకి నెగటివ్ టాక్ రావడంతో అది కలెక్షన్స్ మీద ప్రభావం చూపించింది .మొదటి రోజు బాగానే కలెక్ట్ చేసిన రవితేజ (Ravi teja )రెండవ రోజు నుండి కలెక్షన్స్ డ్రాప్ అవ్వడం మొదలయ్యాయి .ఐదు రోజుల కలెక్షన్స్ చూస్తే మొత్తం వరల్డ్ వైడ్ గా 9 కోట్ల దాకా షేర్, అలాగే 15 కోట్ల దాకా గ్రాస్ కలెక్షన్స్ ను అందుకుంది. ఖిలాడి మూవీ ఫ్రీ రిలీజ్ బిజినెస్ 25 కోట్ల వరకు జరిగింది .ఈ మూవీ హిట్ అనిపించుకోవాలంటే 26 కోట్ల దాకా కలెక్ట్ చేయాలి .కానీ ప్రస్తుతం కలెక్షన్స్ 9 కోట్లు మాత్రమే ఉన్నాయి. రవితేజ ఖిలాడి కలెక్షన్స్ లో పుంజుకోవడానికి ఒక వారం మాత్రమే ఉంది. ఎందుకంటే ఫిబ్రవరి 25న దాదాపు నాలుగు పెద్ద సినిమాలు విడుదల అవుతున్నాయి. ఒక వారంలో రవితేజ ఎంతవరకు కలెక్ట్ చేస్తాడు అన్నది ఆసక్తికరంగా మారింది .ఏది ఏమైనా నా ఖిలాడీ మూవీ కలెక్షన్స్ ఊహించిన స్థాయిలో రాలేదు.