టాలీవుడ్ లో తొలి సినిమాతోనే ఉప్పెనలాంటి భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు దర్శకుడు బుచ్చిబాబు(Buchhi babu sana). ఉప్పెన మూవీ వచ్చి ఒక సంవత్సరం దాటిపోయినా సరే ఈ డైరెక్టర్ నుండి మరో మూవీ రాలేదు .కానీ బుచ్చిబాబు, ఎన్టీఆర్ (NTR)కోసం ఒక పవర్ఫుల్ కథను రెడీ చేశాడట .ఈ కథ రెడీ అవ్వగానే ముందుగా తన గురువుగారైన దర్శకుడు సుకుమార్ కు(Sukumar) వినిపించాడంట. సుకుమార్ కూడా బుచ్చిబాబు రెడీ చేసిన కథ చాలా బాగుందని చెప్పడంతో ఎన్టీఆర్ తో మూవీ చేయడానికి రెడీ అవుతున్నారట. ఇక స్టోరీకి ఎన్టీఆర్ (NTR)కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది .ఈ మూవీ క్రీడా నేపద్యంలో వస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ మూవీకి పెద్ది అనే టైటిల్ పెట్టబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది .ఇక ఈ మూవీని కూడా ఒక భారీ నిర్మాణ సంస్థ నిర్మించబోతున్నట్లు సమాచారం .ఈ మూవీలో ఎన్టీఆర్ ని బుచ్చిబాబు సరికొత్తగా చూపించబోతున్నారు. దాంతో ఈ మూవిపై క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివతో(Koratala siva) మూవీ చేస్తున్నారు .మరి బుచ్చిబాబుతో సినిమా ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి