టీమిండియా మాజీ సారథి,పరుగుల మిషన్ విరాట్ కోహ్లీ (Kholi )ప్రపంచ రికార్డుకి ఒక్క అడుగు దూరంలో ఉన్నారు. ఇప్పటికే అనేక రికార్డులను కోహ్లీ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక వెస్టిండీస్(Wi) తో జరిగే t20 సిరీస్ లో కోహ్లీ ప్రపంచ రికార్డును అందుకనే చాన్స్ వచ్చింది. ఈరోజు జరగబోయే టి20 మ్యాచ్ లో కోహ్లీ 73 పరుగులు చేస్తే టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన మొదటి బ్యాటర్జ్ రికార్డు సాధిస్తాడు .ప్రస్తుతానికి కోహ్లీ టీ20 లో 3227 పరుగులు చేసి రెండవ స్థానంలో ఉండగా ,న్యూజిలాండ్ బ్యాటర్ మార్టిన్ గుప్తిల్ 3299 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక 3197 పరుగులతో టీమిండియా కెప్టెన్(Rohith sharma ) మూడో స్థానంలో ఉన్నాడు .ఇటీవల కాలంలో టి-20లో అంతగా కోహ్లీ రాణించడం లేదు .కానీ ఈ మ్యాచ్ లో అతను మంచి ప్రదర్శన ఇస్తాడని అభిమానులు కోరుకుంటున్నారు. కలకత్తా వేదికగా భారత్, వెస్టిండీస్ (IND Vs WI ) జట్ల మధ్య నేడు టి20 జరగనున్న నేపథ్యంలో కోహ్లీ మరో 73 పరుగులు చేస్తే టీ20 లో అత్యధిక పరుగులు చేసిన మొదటి బ్యాటర్ రికార్డు కొట్టేస్తాడు. మరి ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో కోహ్లీ ఆ రికార్డు అందుకు0టాడా లేదా అన్నది చూడాలి